Australia : బియ్యం కోసం క్యూ కట్టిన భారతీయులు

Australia : బియ్యం కోసం క్యూ కట్టిన భారతీయులు
నిమిషాల్లో అమ్ముడుపోతున్న రైస్ బ్యాగ్ లు

ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రంబాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధిత జాబితాలో చేర్చింది. అయితే ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు కేంద్రం నిర్ణయంతో విదేశాల్లో భారతీయుల బియ్యం కోసం ఎగబడుతున్నారు. ఇండియన్ గ్రోసరీ స్టోర్ ల ముందు క్యూ కడుతున్నారు. భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించిందన్న వార్తలతో అమెరికాలోని భారతీయులు బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు. దీంతో షాపుల్లో రేట్లు పెరిగిపోయాయి. ఒక మనిషికి ఒకటో, రెండో బ్యాగులు మాత్రమే అంటూ షాపుల్లో బోర్డులు పెట్టేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.అమెరికా లోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది.

సాధారణంగా ఓ నెలలో కొనే బియ్యానికి రెట్టింపు పరిమాణంలో భారతీయులు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆస్ట్రేలియాలోని ఓ కిరాణా స్టోర్ మేనేజర్ చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బియ్యం కొనుగోళ్లు బాగా పెరిగాయని వివరించారు. దాంతో తాము డిమాండ్ ను నియంత్రించేందుకు ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్నామని తెలిపారు. చాలామంది భారతీయులు తమ నిర్ణయం పట్ల తిరగబడుతున్నారని, అయినప్పటికీ తాము ఒకరికి 5 కిలోలకు మంచి అమ్మడంలేదని ఆ మేనేజర్ స్పష్టం చేశారు.



ఇతర దేశాల్లో గ్రోసెరీ స్టోర్ ల ముందు క్యూ లు అచ్చంగా ఇండియాలో పెట్రోల్ ధర పెరుగుతుందంటే ముందు రోజు బైకుతో బంక్ ముందు లైను కట్టే క్యూ లాగే కనిపింస్తోంది.ఈ భారీ క్యూ ల వల్ల వార్తల్లో హడావిడి వల్ల షాప్ లలో అవసరం లేకున్నా కూడా డిమాండ్ బట్టి రేట్లు పెంచేశారు. సన్న బియ్యం దొరకకపోతే వియత్నాం, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకున్న బియ్యం, దొడ్డు బియ్యం, ఇడ్లీ రైస్ తిన్నాలేమో అన్న భయం ఎన్నారైలు ఇలా ప్రవర్తించేలా చేస్తోంది.

ప్రపంచంలోని 140కి పైగా దేశాలకు మన దేశం బియ్యం ఎగుమతి చేస్తుంది. గతేడాది 2.22 కోట్ల టన్నుల బియ్యాన్ని భారత్ ప్రపంచానికి విక్రయించింది. ప్రపంచ దిగుమతుల్లో ఇది సుమారు 40 శాతం దాకా ఉంటుంది. అందులో కూడా బాస్మతియేతర సన్నబియ్యమే ఎక్కువ . ఆ సన్నబియ్యానికి అలవాటు పడ్డవారికే ఇప్పుడు ఈ చిక్కులు వచ్చిపడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story