US Attack on Iran : ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్.. ఇరాన్ పై అమెరికా దాడి జరిగిందిలా!

US Attack on Iran : ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్.. ఇరాన్ పై అమెరికా దాడి జరిగిందిలా!
X

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. రెండు వారాల గడువు అంటూనే 2 రోజుల్లోనే ఇరాన్ పై భీకర దాడి చేశాడు. ఏకంగా 18 గంటల పాటు అమెరికా బి-2 బాంబర్లు ఇరాన్ గగన తలం నుంచి యుద్ధ బీభత్సం సృష్టించాయి. 14 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది అమెరికా. మూడు కీలకమైన ఫోర్టో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున గం.4.10లకు తొలిబాంబు ఇరాన్ ను తాకింది. మూడే నిమిషాల్లో విధ్వంసం పూర్తయింది. ఆకాశంలోనే ఇంధనం నింపుకుంటూ అమెరికా సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించిందని ట్రంప్ విజయగర్వంతో ప్రకటించారు. వీటికి తోడుగా ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైకి క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్ ను నాశనం చేస్తానని ముందే చెప్పానని, ఇప్పుడు నిలబెట్టుకున్నానని ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు చెప్పారు. ఇప్పుడు ఇరాన్ కు కాళ్లబేరం తప్ప మరో దారిలేదని ట్రంప్ చెప్పారు. మిడిల్ ఈస్ట్ లో బెదిరింపు దేశంగా ఇరాన్ మారిందని.. ఇప్పటికైనా మాట వినకపోతే చరిత్ర ముగిసినట్టేనని హెచ్చరించారు.

Tags

Next Story