Pakistani Soldiers : ఆపరేషన్ సిందూర్‌.. 11 మంది పాకిస్తాన్ సైనికులు మృతి

Pakistani Soldiers : ఆపరేషన్ సిందూర్‌.. 11 మంది పాకిస్తాన్ సైనికులు మృతి
X

పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్య కారణంగా పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూసింది . ఆపరేషన్ సిందూర్‌లో, పాకిస్తాన్‌లో పెంచి పోషించిన అనేక మంది భయంకరమైన ఉగ్రవాదులను హతం అయ్యారు. భారత్ జరిపిన ప్రతీకార చర్యలో చాలా మంది పాకిస్తాన్ సైనికులు కూడా మరణించారు. పాకిస్తాన్ స్వయంగా దీనిని అంగీకరించింది. భారత సైన్యం జరిపిన దాడిలో 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ జరిపిన ప్రతీకార చర్యలో తమ సైనికులు11 మంది మృతి చెందగా 78 మంది గాయాలయ్యాని పాక్ ఆర్మీ వెల్లడించింది. అంతేకాకుండా మరో 40 మంది పౌరులు మృతి చెందారని, 121 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. దీనితో పాటు, భారత క్షిపణి దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళం కూడా భారీ నష్టాలను చవిచూసిందని పాకిస్తాన్ అంగీకరించింది.

Tags

Next Story