భారత్ లాంటి మిత్ర దేశాలను అలాంటి పదజాలంతో దూషించడం సరికాదు : జో బిడెన్

X
అమెరికా చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో భారత్ వాయు కాలుష్యంపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యర్థి జో బిడెన్ మండిపడ్డారు. భారత్ లాంటి మిత్ర దేశాలను అలాంటి పదజాలంతో దూషించడం సరికాదని ట్వీట్ చేశారు. ప్రపంచ వాతావరణ కాలుష్యానికి సమాదానం వెతకాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇతరులను దూషించడం వల్ల ఉపయోగం లేదని బిడెన్ హితవుపలికారు. తాను, కమలా హారిస్... అమెరికా మిత్రదేశాలను విదేశాంగ నీతితో గౌరవిస్తామంటూ బిడెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
