Pakistan: ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో హింస..

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన హింసలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. వాహనాల కాన్వాయ్‌పై దాడి అనంతరం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని కుర్రం జిల్లా అలీజాయ్, బగన్ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 47 మంది వరకు హత్యకు గురయ్యారు. మరో వైపు బలిషెల్, ఖార్ కాలీ, కుంజ్ అలీజాయ్, మక్బాల్‌లో సైతం కాల్పులు కొనసాగుతున్నాయి. భారీ ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 18 మంది చనిపోగా, 30 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో 30 మందికిపైగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఘర్షణల్లో ఇండ్లతో పాటు దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి. ఘర్షణల నేపథ్యంలో పలువురు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శనివారం విద్యాసంస్థలను మూసి ఉంచినట్లు ప్రైవేట్ ఎడ్యుకేషన్ నెట్‌వర్క్ చైర్మన్ ముహమ్మద్ హయత్ హసన్ తెలిపారు. బగన్, మండూరి, ఓచాట్‌లో గురువారం 50 మందికిపైగా ప్రయాణికుల వాహనాలపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఆరు వాహనాలు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు పరాచినార్ నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. బాధితుల్లో ఎక్కువ మంది షియా వర్గానికి చెందిన వారు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com