Pakistan Drone Attacks : బోర్డర్ గ్రామాలే లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులు

Pakistan Drone Attacks : బోర్డర్ గ్రామాలే లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులు
X

భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతోంది. శనివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్‌ గగనతలంలో భద్రతా బలగాలు శత్రు డ్రోన్‌ను గుర్తించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. వైమానిక రక్షణ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేశాయన్నారు. దీనికి సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరోవైపు శ్రీనగర్‌ విమానాశ్రయం పైనా డ్రోన్లతో దాడికి పాక్‌ యత్నించినట్లు తెలుస్తోంది. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్‌ ఎయిర్‌ బేస్‌పై డ్రోన్లతో దాడి చేయగా.. సైన్యం వీటిని తిప్పికొట్టింది.

Tags

Next Story