Pakistan : భారత విమాన రాకపోకలపై నిషేధాన్ని పొడిగించిన పాక్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ - భారత్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్‌తో అవి తీవ్ర స్థాయికి చేరాయి. అప్పటినుంచి ఇరు దేశాలు ఒకరి గగనతలంలో మరోదేశ విమానాల రాకపోకలను నిషేధించాయి. ఈ క్రమంలో తన గగనతలంలో భారత విమానాలపై రాకపోకలను పాక్ మరోసారి పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారత ఎయిర్‌లైన్స్‌పై బ్యాన్‌ను అమల్లో ఉంటుందని పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలన్నింటికీ వర్తిస్తుందని తెలిపింది.
ఇటు భారత్ కూడా పాకిస్థాన్ విమాన రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నెల 24 వరకు పాకిస్థాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ఇండియా మొదట ఏప్రిల్ 30న ఈ ఆంక్షలను విధించింది. ఆ తర్వాత ఈ బ్యాన్‌ను జులై 24 వరకు పొడిగించింది. ఈ గడువును ఇప్పుడు మళ్లీ పొడిగించే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com