IMF : రూ.8 వేల కోట్ల రుణం పొందేందుకు పాకిస్తాన్ కు అర్హత ఉంది : ఐఎంఎఫ్

IMF : రూ.8 వేల కోట్ల రుణం పొందేందుకు పాకిస్తాన్ కు అర్హత ఉంది : ఐఎంఎఫ్
X

పాకిస్తాన్ కు ఒక బిలియన్ డాలర్ల(రూ.8 వేల కోట్లు) బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించడాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్ ) సంస్థ సమర్థించుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశం రుణం పొందేందుకు అర్హత కలిగి ఉన్నట్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర వాద శిబిరాలపై భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత దాయాది దేశం ఏకపక్షంగా కాల్పులకు తెగబడిన సమయంలో ఐఎంఎఫ్ ఈ నిధులు విడుదల చేసింది. ఆ దేశానికి ఇచ్చే రుణం ఉగ్రవాద కార్యకలాపాలు దోహద పడుతుందని భారత అభ్యంతరం తెలిపింది. ఇండియా అభ్యంత రం తెలిపిన కొన్ని రోజుల తర్వాత తాజాగా స్పందించిన ఐఎంఎఫ్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. గత ఏడాది 7 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై ఐఎంఎఫ్, పాకి స్తాన్ సంతకాలు చేశాయి. ఇప్పటికీ రెండు విడతలుగా 2.1 బిలయన్ డాలర్లను విడుదల చేశారు. 'పాక్ అన్ని లక్ష్యాలను చేరుకుందని బోర్డు గుర్తించింది. కొన్ని సంస్కరణలపై ఆ దేశం పురోగతి సాధించింది. అందుకే ఆ ప్రోగ్రామ్కు ఆమోదం తెలిపాం' అని ఐఎంఎఫ్ డైరెక్టర్ జూలీ కొజాక్ పేర్కొన్నారు.

Tags

Next Story