Pakistan : పాకిస్తాన్ కు ఆయుధాల కొరత

పాకిస్తాన్ ను ఆయుధాల కొరత వెంటాడుతోంది. తమ వద్ద 130 అణుబాంబులు ఉన్నాయని బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న దాయాది దేశానికి భారత్తో యుద్ధం అనివార్యం అయితే సరిగ్గా నాలుగు రోజులకు సరిపడే మందుగుండు సామాగ్రి లేదట. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ తో ఆయుధ సంపత్తి పెంచడంలో పాకిస్తాన్ ఆర్డి నెన్స్ ఫ్యాక్టరీలు ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. దీనికి అదనంగా ఉక్రెయిన్తో కుదుర్చుకున్న ఒప్పందం పాక్ యుద్ధ నిల్వలను మరింత తు డిచిపెట్టింది. భారత్తో పోరాడేందుకు ఆ దేశం ఎక్కువగా ఫిరంగులు, సాయుధ విభాగాలపై ఆధారపడుతుంది. అయితే ఎం 109 హోవిట్జ్ ర్లకు కావాల్సిన 155ఎంఎం షెల్స్, బీఎం - 21 సిస్టమ్స్ కావాల్సిన 122ఎంఎం రాకెట్స్ పాక్ ఆర్మీ వద్ద చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విషయమై పాకిస్తాన్ సైనిక నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు, రెండు రోజుల క్రితం జరిగిన ఆ దేశ కోర్ కమాండర్ల సమా వేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com