Pakistan : రెండు నెలల్లో పాక్‌కు రూ.1,240 కోట్ల నష్టం

గడచిన రెండు నెలల్లో పాకిస్తాన్ రూ. 1,240 కోట్ల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టానికి ప్రధాన కారణం భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడమే. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. ఏప్రిల్ 24, 2025న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్ భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా, ఇతర దేశాల విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించినప్పుడు పాకిస్తాన్ ఓవర్ ఫ్లయింగ్ ఛార్జీల రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. అయితే, భారత విమానాల నిషేధం కారణంగా ఈ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA)కి ఈ గగనతల మూసివేత వల్ల దాదాపు రూ. 1,240 కోట్లు (పాకిస్తాన్ కరెన్సీలో 30 బిలియన్లు) నష్టం వాటిల్లినట్లుగా పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే అల్లాడుతున్న పాకిస్తాన్‌కు ఈ నిర్ణయం మరింత గట్టి దెబ్బగా మారింది. అయినప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం భారత విమానాలపై గగనతల నిషేధాన్ని ఆగస్టు 24 వరకు పొడిగించడం గమనార్హం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com