Shehbaz Sharif : నన్ను అభినందించిన మోదీకి ధన్యవాదాలు : షెహబాజ్ షరీఫ్
Shehbaz Sharif : భారతదేశం, పాకిస్తాన్ శాంతిని సాధించాలన్నారు పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్. తనను అభినందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాము భారతదేశంతో శాంతి, సహకారాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. జమ్మూ-కశ్మీరుతో సహా వివాదాలన్నీ శాంతియుతంగా పరిష్కారమవడం చాలా అవసరమని పేర్కొన్నారు.
ఉగ్రవాదంతో పోరాటంలో పాకిస్తాన్ చేసిన త్యాగాలు అందరికీ తెలుసునన్నారు. మనం శాంతిని సాధించి, ఇరు దేశాల ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. అటు.. సోమవారం ప్రధాని పీఠమెక్కిన తొలిరోజే షెహబాజ్ షరీఫ్ తన నైజం బయటపెట్టుకున్నారు. భారత్‌పై విషం చిమ్ముతూ మాట్లాడారు.
కశ్మీర్ లోయ నెత్తురోడుతోందని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు దౌత్యపరమైన, నైతిక మద్దతు అందిస్తామన్నారు. అదే సమయంలో చైనాతో తమ బంధం ఏ పరిస్థితుల్లోనూ చెక్కుచెదరబోదని స్పష్టం చేశారు. ఆది నుంచీ భారత్-పాక్ మధ్య సత్సంబంధాలు లేవని పేర్కొన్నారు.
Thank you Premier Narendra Modi for felicitations. Pakistan desires peaceful & cooperative ties with India. Peaceful settlement of outstanding disputes including Jammu & Kashmir is indispensable. Pakistan's sacrifices in fighting terrorism are well-known. Let's secure peace and.. https://t.co/0M1wxhhvjV
— Shehbaz Sharif (@CMShehbaz) April 12, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com