Pakistan : భారత్ తో శాంతిచర్చలకు సిద్ధం

దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. విదేశాల్లో భారత ఎంపీల పర్యటన వేళ ఆదేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఇరు దేశాల మధ్య అపరిష్కృత అంశాలన్నింటినీ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. నిజాయితీగా శాంతిని కోరుకుంటున్నాం. కశ్మీర్, ఉగ్రవాద నిర్మూలన, సిందూ జలాల ఇష్యూ, ట్రేడ్డీల్స్.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో భారత్ యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటే మేమూ దీటుగానే స్పందిస్తాం' అంటూ హెచ్చరించారు. కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో తప్ప ఏ విషయంలోనూ చర్చలు ఉండబోవని భారత్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో షెహబాజ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com