Saudi Arabia : పరస్పర రక్షణ ఒప్పందంపై పాక్, సౌదీ సంతకాలు

Saudi Arabia : పరస్పర రక్షణ ఒప్పందంపై పాక్, సౌదీ సంతకాలు
X

పరస్పర రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్, సౌదీ అరేబియా సంతకాలు చేశాయి. తమలో ఏ ఒక్క దేశంలపై దాడి జరిగినా అది రెండు దేశాల పై చేసినట్లుగా నే పరిగణిస్తామని ప్రకటించాయి. సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ ఒప్పం దంపై సంతకాలు చేశారు. హమాస్ నా యకులను లక్ష్యంగా చేసుకొని ఈ నెల 9న ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన కొద్ది రోజులకే ఈ అగ్రిమెం ట్ జరిగింది. పాక్, సౌదీ మధ్య జరిగిన రక్షణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణీధర్ జైశ్వాల్ స్పందిం చారు. జాతీయ భద్రతతో పాటు రీజినల్, గ్లోబల్ స్టెబిలిటీ కోసం ఈ ఒప్పంద ప్రభా వాన్ని అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ ప్రయోజనాలను పరి రక్షించ డానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Tags

Next Story