Balochistan : పాకు షాక్ స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్!

Balochistan : పాకు షాక్ స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్!
X

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత లు కాస్తా తగ్గుముఖ పడుతున్న వేళ దాయాది దేశానికి భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా తమ భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. బలూచిస్తాన్, పాకిస్తాన్ లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్ దీర్ఘకాలంగా స్వాతంత్ర్య ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల ఉల్లంఘన, పాక్ సైన్యం చేస్తున్న అణచివేతలపై బలూచ్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమ హక్కుల కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా కొనసాగుతోంది. ఇది పాకిస్తాన్ సైన్యంతో పాటు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు స్వతం త్రదేశంగా అవతరించినట్లు ప్రకటించుకుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ కు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోలను బలూచిస్తాన్ రిలీజ్ చేసింది. అలాగే, భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలను ఏర్పాటు చేయాలని కోరింది.

Tags

Next Story