Pakistan Inflation: భారత్ దెబ్బకు మరింత ఆర్థిక సంక్షోభంతో పడ్డ శత్రుదేశం

Pakistan Inflation: భారత్ దెబ్బకు మరింత ఆర్థిక సంక్షోభంతో  పడ్డ శత్రుదేశం
X
కిలో బియ్యం రూ.339, డజన్ గుడ్లు రూ.332, కిలో నెయ్యి రూ.3వేలు

ఇప్పటికే తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పై భారత్ విధించిన ఆంక్షలు కూడా తోడవ్వడంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోతోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చన్న వార్తలతో పాక్ లో ద్రవ్యోల్బణం కొండెక్కింది. నిత్యవసరాలు, ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పలు నివేదికల ప్రకారం పాక్ లో కిలో బియ్యం ధర రూ.339గా ఉంది. డజన్ గుడ్ల ధర రూ.332గా ఉంది. లీటర్ పాల ధర రూ.224గా ఉంది. కిలో టమాట ధర రూ.150గా ఉంది. కేజీ చికెన్ ధర 800 రూపాయలు పలుకుతోంది. ఇలా ఏ ఆహార పదార్ధం ధర చూసినా దిమ్మతిరిగిపోతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ కు ఇప్పుడీ ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా మారింది.

జమ్మకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత లష్కరే తోయిబా (LeT)తో అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది.

ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ పై ప్రతిచర్యలకు దిగింది. వీటిలో సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ పౌరులు, అధికారులను భారతదేశం నుండి బహిష్కరించడం ఉన్నాయి. ఈ చర్యలు పాకిస్తాన్‌లో గణనీయమైన ఆర్థిక పతనానికి దారితీశాయి. ముఖ్యంగా నిత్యావసరల ధరలను ప్రభావితం చేశాయి. రాజకీయ, దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్‌లో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి.

కిలో చక్కెర రూ.180..

భారత్ లో కిలో చక్కెర ధర దాదాపు 50 రూపాయలు. అదే పాకిస్తాన్‌లో కిలో చక్కెర ధర దాదాపుగా 180 రూపాయలు. కరాచీలో కిలో చక్కెర ధర 175 రూపాయలకు చేరుకుంది. క్వెట్టాలో 164 రూపాయలుగా ఉంది. చాలా చోట్ల పాకిస్తానీయులు కేజీ చక్కెర కోసం 180 రూపాయల వరకు చెల్లిస్తున్నారు.

వామ్మో.. నిమ్మకాయ..

పాకిస్తాన్‌లో నిమ్మకాయలు కూడా విలాసవంతమైన వస్తువుగా మారుతున్నాయి. grocerapp.pk ప్రకారం, పాకిస్తాన్‌లో 250 గ్రాముల నిమ్మకాయ ధర ఇప్పుడు 234 రూపాయలుగా ఉంది.

పాకిస్తాన్‌లో తేనె ధర విపరీతంగా పెరిగింది. grocerapp.pk ప్రకారం 500 గ్రాముల తేనె ధర 550 నుండి 770 రూపాయలుగా ఉంది.

పాకిస్తానీ వంటశాలలలో ప్రధానమైన వంట పదార్థమైన నెయ్యి చాలా ఖరీదైనదిగా మారింది. grocerapp.pk ప్రకారం కిలో నెయ్యి ధర ఇప్పుడు 2వేల 895 రూపాయలుగా ఉంది.

పాకిస్తానీ సూట్ల అమ్మకాలలో తగ్గుదల..

పాకిస్తానీ సూట్లు, ముఖ్యంగా మహిళల దుస్తులు, భారతదేశంలో చాలా కాలంగా ప్రాచుర్యం పొందాయి. అయితే, పహల్గామ్ దాడి, దాని ఫలితంగా ఏర్పడిన దౌత్యపరమైన పరిణామాల తర్వాత ఈ సూట్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

వాణిజ్య ఆంక్షల ప్రభావం..

భారత్ అట్టారి-వాఘా సరిహద్దును కూడా మూసివేసింది. దీనితో దాదాపు 3,886.53 కోట్ల రూపాయల విలువైన సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది. ఇది పాకిస్తాన్‌లో ఔషధాల నుండి ఎరువుల వరకు వివిధ వస్తువుల లభ్యతను ప్రభావితం చేసింది. దీని వలన ధరలు మరింత పెరిగాయి.

Tags

Next Story