Imran Khan : ప్రధాని మోదీతో టీవీ డిబేట్‌ జరపాలనుకుంటున్నా : ఇమ్రాన్ ఖాన్

Imran Khan :  ప్రధాని మోదీతో టీవీ డిబేట్‌ జరపాలనుకుంటున్నా : ఇమ్రాన్ ఖాన్
Imran Khan : భారత్‌-పాక్‌ల మధ్య విభేదాల పరిష్కారానికి... ప్రధాని మోదీతో టీవీ డిబేట్‌ జరపాలనుకుంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

Imran Khan : భారత్‌-పాక్‌ల మధ్య విభేదాల పరిష్కారానికి... ప్రధాని మోదీతో టీవీ డిబేట్‌ జరపాలనుకుంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. రెండు రోజుల రష్యా పర్యటనకు ముందు.. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించగలిగితే భారత ఉపఖండంలోని కోట్లాది జనాభాకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటం తమ ప్రభుత్వ విధానమని.. అయితే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మారడంతో.. వాణిజ్యం కూడా తగ్గిపోయిందన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందిస్తూ.. ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదన్నారు. పాక్‌కు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయన్నారు.

వాటిని బలోపేతం చేయాలనుకుంటున్నామని అన్నారు. ఆర్థిక సహకారంపై చర్చల కోసం రష్యా పర్యటనకు వెళ్లనున్న ఇమ్రాన్‌.. అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవనున్నారు. అయితే, ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు. ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి పని చేయవని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. చర్చలు చేయాలనుకుంటే ఉగ్రవాదాన్ని వదిలేయాలని భారత్ కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తోంది.

అలాగే కశ్మీర్‌లో పాకిస్తానీల చొరబాటులకు చెక్కు పెట్టాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. 2008లో ముంబైలోని తాజ్ హోటల్ వద్ద జరిగిన ఉగ్రదాడి, పఠాన్‌కోట్‌లో 2016లో జరిగిన ఉగ్రదాడి..... అలాగే 2019లో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య మరింత దూరం పెరిగింది. పుల్వామా దాడికి ప్రతిగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ మెరుపు దాడులు చేసింది.

Tags

Next Story