Nepal Plane Crash : నేపాల్‌లో కుప్పకూలిన విమానం - 19 మంది మృతి

Nepal Plane Crash : నేపాల్‌లో కుప్పకూలిన విమానం - 19 మంది మృతి
X

ఖాట్మండ్: నేపాల్‌ రాజధాని ఖాట్మండులో భారీ విమాన ప్రమాదం జరిగింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. పోఖారాకు వెళ్లే విమానంలో సిబ్బందితో సహా 19 మంది ప్రయాణిస్తుండగా వారందరూ మృతి చెందారు. విమానం కుప్పకూలిన తర్వాత పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక సిబ్బంది నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ప్రమాదానికి గురైనట్టు అక్కడి మీడియా వెల్లడించింది.

Tags

Next Story