Plane Crashes : గోల్ఫ్ కోర్టులో కుప్పకూలిన విమానం..

Plane Crashes : గోల్ఫ్ కోర్టులో కుప్పకూలిన విమానం..
X

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న మోనా వేల్ గోల్ఫ్ కోర్స్‌లో చిన్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు (50 ఏళ్ల వయస్సు వారు) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంజిన్ పవర్ కోల్పోవడంతో ఈ విమానం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గోల్ఫ్ ఆడుతున్న వాళ్ల మధ్య విమానం నేలపైకి దూసుకువచ్చి ఆగిపోవడాన్ని చూడవచ్చు. విమానం కూలిపోయినా, చెట్లు, ఇతర అడ్డంకులను తప్పించుకోవడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. స్థానికుల సమాచారం మేరకు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ATSB) దర్యాప్తు ప్రారంభించింది.

Tags

Next Story