Modi-Putin Meeting: నేడు మోడీ- పుతిన్ మధ్య కీలక భేటీ.

ఉక్రెయిన్ సహా కీలక అంశాలపై చర్చ..

భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. తన అధికారిక నివాసం నోవో- ఒగారియోవోలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నాయకత్వాన్ని, విజయాలను అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. ‘ నా ప్రియమైన స్నేహితుడు అంటూ మోడీని కౌగిలించుకున్నాడు.. భారత ప్రధానిగా మరోసారి ఎన్నికైన మోడీకి అభినందనలు చెప్పారు. మోడీ అంకిత భావంతో కృషి చేస్తారు.. శక్తిమంతమైన ఆయన నాయకత్వంలో భారత్ అభివృద్ది పథంలో దూసుకుపోతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.

భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు. ఈమేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్‌ విందులో పుతిన్‌ మాట ఇచ్చినట్లు సమాచారం. మాస్కో శివార్లలోని నోవో-ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్‌ ప్రత్యేక విందు ఇచ్చారు.ఈ క్రమంలో రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికిగాను వారిని విడుదల చేస్తామని పుతిన్‌ హామీ ఇచ్చారని అధికారిక వర్గాల సమాచారం. అదేవిధంగా మూడోసారి విజయం సాధించినందుకు మోదీని అభినందించారు.

కాగా, మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఇవాళ (మంగళవారం) విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయిని అధికారులు చెప్పారు. సమావేశాల అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని రష్యా మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వీరి భేటీలో ఉక్రెయిన్ తో యుద్ధం సహా కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉందని రష్యా స్థానిక మీడియా తెలిపింది. అయితే, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని మంత్రి అయ్యాక ఆయనకు ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం.. అలాగే, ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు మోడీ వెళ్లడం ఇదే తొలిసారి.

Tags

Next Story