PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్..

PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్..
X
షెహబాజ్ షరీఫ్‌ను పట్టించుకోని ప్రధాని మోడీ

చైనా వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనా వేదికగా సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ముందుగా దేశాధినేతలంతా గ్రూప్ ఫొటో దిగారు. ఆయా దేశాధినేతలంతా వరుసగా నిలబడ్డారు. వరుస క్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నిలబడి ఉన్నారు. ప్రధాని మోడీ తన స్థానంలో నిలబడేందుకు షెహబాజ్ షరీఫ్‌ను దాటుకుని వెళ్లాలి. కానీ మోడీ మాత్రం పాక్ ప్రధాని వైపే చూడలేదు. పుతిన్‌తో ఏదో మాట్లాడుతున్నట్లుగా దాటుకుని వెళ్లిపోయారు. ఇక గ్రూప్ ఫొటో దిగిన తర్వాత కూడా షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడేందుకు కూడా మోడీ ఇష్టపడలేదు. పుతిన్-జిన్‌పింగ్‌తో సంభాషిస్తూ.. పాక్ ప్రధాని వెళ్లిపోగానే వారి వెనుక నెమ్మదిగా మోడీ వెళ్లారు.ఇక మోడీ-పుతిన్-జిన్‌పింగ్ చాలా కులాసాగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా సేపు నవ్వుకుంటూ సంభాషించుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 26 మందిని మతం పేరుతో పొట్టనపెట్టుకున్నారు. అనంతరం భారత ప్రభుత్వం సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా వీసాలను రద్దు చేసింది. అటరీ సరిహద్దు నిలిపివేసింది. ఇక మే 7 ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదలను హతం చేయగా.. అలాగే పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. దీంతో అమెరికాతో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-రష్యా-చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. సరిహద్దు ఘర్షణల తర్వాత చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తిరిగి 7 ఏళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్లారు.

Tags

Next Story