PM Modi Xi Jinping: ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ..

PM Modi Xi Jinping: ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ..
X
బ్రిక్స్‌ వేదికగా ద్వైపాక్షిక చర్చలు

దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తొలిసారి సమావేశమయ్యారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ మీటింగ్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం ప్రారంభమైంది. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు పెద్దగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టిపెట్టలేదు. తాజాగా బ్రిక్స్ ఇరు దేశాధినేతల భేటీకి వేదికగా మారింది.

గల్వాన్ ఘర్షణ తర్వాత తూర్పు లడాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదిలా ఉంటే, బ్రిక్స్ సమావేశాలకు ముందు భారత్-చైనాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇదు దేశాల సైనికులు సరిహద్దు నుంచి విత్ డ్రా చేసుకోవాలనే ఒప్పందాన్ని ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో డెప్సాంగ్, డెమ్‌చోక్‌లో రెండు దేశాల సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది. గతంలో అనేక సార్లు రెండు దేశాల సైన్యం మధ్య చర్చల అనంతరం పాంగాంగ్ త్సో, గోగ్రా, హాట్ స్ప్రింగ్ వంటి ప్రాంతాల నుంచి సైనిక ఉపసంహరణ జరిగింది.

చివరిసారిగా ఇద్దరు నేతలు 2019లో కలుసుకున్నారు. చైనా-ఇండియా మధ్య ఈ ఒప్పందం కుదిరిని మూడు రోజుల్లోనే మోడీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు నవంబర్ 2022లో ఇండోనేషియాలోని బాలిలో జరిగే G20 శిఖరాగ్ర సమావేశంలో, ఆగస్టు 2023లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ఇద్దరు నేతల పలకరింపులు మాత్రమే చోటు చేసుకున్నాయి. ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. నాలుగేళ్లుగా రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా లేవు. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా యాప్స్‌ నిషేధించడంతో పాటు చైనా పెట్టుబడులపై భారత్ నిఘా పెంచింది. ప్రస్తుత సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు నార్మల్ అవుతాయని అంతా భావిస్తున్నారు.

Tags

Next Story