Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా

X
By - Manikanta |18 July 2024 11:32 AM IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. తాజా పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు వాక్సినేషన్ జరిగిందని, డెలావేర్‌లో ఐసొలేషన్‌లో ఉంటారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ తెలిపారు. ఆయన హెల్త్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, ఐసొలేషన్‌లో ఉంటూనే బైడెన్ తన విధులను నిర్వహిస్తారని పేర్కొన్నారు. జో బైడెన్ తన సోషల్ మీడియా ఖాతాలోలో ఇలా రాశారు. ‘ఈ రోజు మధ్యాహ్నం నేను కోవిడ్ -19 టెస్టులు చేయించుకున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను అనారోగ్యం నుంచి కోలుకునేవరకూ అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను’అని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com