Pushpa 2 in Canada : కెనడాలో వసూళ్లతో రఫ్ఫాడిస్తున్న పుష్ప - 2

Pushpa 2 in Canada : కెనడాలో వసూళ్లతో రఫ్ఫాడిస్తున్న పుష్ప - 2
X

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప - 2 ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సఫీసును బద్దలు కొడుతూ దూసుకెళ్తంది. ఇప్పటి వరకూ రూ. 1,800 కోట్ల కలెక్షన్ సాధించింది ఈ సినిమా . నార్త్ లో ఇప్పటికీ వసూళ్ల హవా కొనసాగిస్తూనే ఉందీ సినిమా. 'పుష్ప 2: ది రూల్ ' హిందీలో రూ. 1000 కోట్ల బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన ఏకైక దక్షిణ భారత చిత్రంగా నిలిచింది. హిందీలో రూ. 1000 కోట్లు వసూలు చేసినవి 3 సినిమాలు మాత్రమే. ఇప్పుడు హిందీలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను సాధించిన మూడవ భారతీయ చిత్రం పుష్ప 2. నిలిచింది. అంతకు మందు రూ. 1000 కోట్లు కొట్టిన రెండు చిత్రాలు షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్', మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జవాన్' మాత్రమే.

ఇటు ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ ‘పుష్ప 2’ రికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీ కెనడాలో ఏకంగా 4.13 మిలియన్ డాలర్ల వసూళ్లతో రఫ్ఫాడించింది. కెనడాలో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీగా ‘పుష్ప 2’ నిలిచింది. గతంలో ‘కల్కి 2898 ఎడి’ 3.5 మిలియన్ డాలర్లతో టాప్ ప్లే్స్‌లో నిలిచింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

Tags

Next Story