Putin Secret Son : తెరపైకి పుతిన్ రహస్య కుమారుడు

Putin Secret Son : తెరపైకి పుతిన్ రహస్య కుమారుడు
X

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రహస్య కుమారుడు ఇవాన్ ఫొటోలు బయట పడ్డాయి. వీటిని రష్యన్ యాంటీ- క్రెమ్లిన్ టెలిగ్రామ్ ఛానల్ విడుదల చేసింది. పుతిన్ అతని దీర్ఘకాల భాగస్వామి జిమ్నాస్ట్ అలీనా కబెవా (41)ల కుమారుడే ఈ ఇవాన్ అని తెలుస్తోంది. తాజాగా బయటకొచ్చిన రెండు అస్పష్ట మైన చిత్రాలు, ఇవాన్ వ్లాది మిరోవిచ్ పుతిన్ ను మొదటిసారి బాహ్యప్రపంచానికి పరిచయం చేశాయి.

ఇవాన్.. భారీ భద్రత మధ్య, ఏకాంత జీవితాన్ని గడుపుతున్నాడు. బాల్యంలో అచ్చు పుతిన్ లా ఉండేవాడట. ఇవాన్ ఇతర పిల్లలతో అరుదుగా మాట్లాడతాడని, ఎక్కువ సమయం గార్డులు, గవర్నెస్లు, ఉపాధ్యాయులతోనే గడుపుతాడని టెలిగ్రామ్ చానల్ వెల్లడించింది. మొదటి ఫొటోలో ఇవాన్ సాంప్రదాయ రష్యన్ దుస్తులను ధరించి ఉన్నాడు. రెండవ చిత్రంలో తన తల్లి శ్రీమతి కబెవాతో కలిసి ఉన్నాడు. డోసియర్ సెంటర్ ప్రకారం, ఇవాన్ 2015లో స్విట్జర్లాండ్లోని లుగానోలో ఉన్న ప్రసూతి క్లినిక్లో జన్మించాడు. ఇవాన్కు డిస్నీ కార్టూన్లు, ఐస్ హాకీ అంటే ఇష్టం. ఇక ఇవాన్ కు ఓ తమ్ముడు కూడా ఉన్నాడని, అతడు 2019లో మాస్కోలో జన్మించాడని నివేదికలు చెబుతున్నాయి. వీరిద్దరూ వ్యక్తిగత శిక్షకులు, ట్యూటర్లతో మాస్కో సమీపంలోని ఒక భవ నంలో నివసిస్తున్నారని సమాచారం. మాజీ ఒలింపిక్ రిథమిక్ జిమ్నాస్ట్ అయిన అలీనా కబేవా, వ్లాదిమిర్ పుతిన్ తో రిలేషన్లో ఉన్నట్లు చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. వీటిపై ఆమె ఎప్పుడూ స్పందించలేదు. పుతిన్ ఆమెకు మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

Tags

Next Story