Trump : రిలీజ్ చేయండి .. లేకపోతే విద్వంసమే ..హమాస్ కు ట్రంప్ డెడ్లైన్

పాలస్తీనా బందీలను శనివారం మధ్యాహ్నంలోగా హమాస్ విడుదల చేయాలని, లేకపోతే విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇజ్రాయెల్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. బందీలు విడుదల కాని పక్షంలో విధ్వంసం మళ్లీ మొదలవుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓవెల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ 'హమాస్ చర్య భయంక రమైనది. కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రా యెల్ నిర్ణయం. కానీ, నాకు సంబంధిం చినంత వరకు శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయాలి. లేకపోతే నరకం ఎదుర్కోవా ల్సి ఉంటుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయి' అని పేర్కొన్నారు. మరోవైపు, గాజాను సొంతం చేసుకుంటామన్న ట్రంప్ ప్రతిపాదనను పాలస్తీనియన్లు తిరస్కరిస్తున్నారు. వారికి అరబ్ దేశాలు మద్దతిస్తున్నాయని ఈజిప్ట్ విదేశాంగ శాఖ యూఎస్ కు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com