Indians In Russian Army : రష్యా సైన్యం నుంచి భారతీయుల విడుదల

Indians In Russian Army : రష్యా సైన్యం నుంచి భారతీయుల విడుదల
ఇతర కేసులపై ఎంబసీ ఫోకస్

రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయులను.. భారత్ డిమాండ్ మేరకు మాస్కో సేవల నుంచి తప్పించినట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా బలగాలలోని భారతీయులను సైనిక సేవల నుంచి తప్పించేందుకు మాస్కోతో చర్చలు కొనసాగించిడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. రష్యా సైన్యంలో చాలా మంది సహాయక సిబ్బందిగా భారతీయులు సేవలందిస్తున్నారు. అయితే వారిని బలవంతంగా ఉక్రెయిన్ పై యుద్ధంలో పోరాడేందుకు అక్కడి సైనికాధికారులు ఆదేశిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగు చూశాయి. ఆ కథనాలు స్పష్టంగా లేవని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

మాస్కోలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి కేసును రష్యా అధికారులతో చర్చిస్తున్నామనీ,దిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంతో సమ న్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే చాలామంది భారతీయులు రష్యా సైన్యం నుంచి తప్పించారని, వీలైనంత తొందరగా మిగిలిన కేసులను పరిష్కరిస్తామని వివరించింది. కొద్దిరోజుల క్రితమే రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయులను విడిపించేందుకు మాస్కోతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఉక్రెయిన్‌లోని సంఘర్షణ ప్రాంతానికి దూరంగా ఉండాలని వారిని కోరుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. కొంతమంది భారతీయులు రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్నారని, అందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఓ భారతీయుడు మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు ప్రచురించింది. రష్యా ఆక్రమిత దొనెట్స్క్‌ ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై, ఈ యుద్ధంలో చిక్కుకుపోయిన మరో భారతీయుడు స్పందించాడు. అతడు తుపాకీ కాల్చడాన్ని సాధన చేస్తుండగా 150 మీటర్ల దూరం నుంచి తాను చూశానని చెప్పాడు. ఆ సమయంలోనే ఈ దాడి జరిగిందని తెలిపాడు. ఇక తమను రష్యా నుంచి ఎలాగైనా బయటపడేయాలని అతడు అభ్యర్థించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపైనే తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది.


Tags

Read MoreRead Less
Next Story