UK ప్రధాని ఇంట దీపావళి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో అక్షత

UK ప్రధాని ఇంట దీపావళి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో అక్షత
భారతీయ మూలాలు ఉన్న వారు ఎక్కడ ఉన్న తమ సంప్రదాయ రీతులను మరచిపోరు అనడానికి మరోసారి నిదర్శనం చూపారు UK ప్రధాని రిషి సునక్ దంపతులు.

భారతీయ మూలాలు ఉన్న వారు ఎక్కడ ఉన్న తమ సంప్రదాయ రీతులను మరచిపోరు అనడానికి మరోసారి నిదర్శనం చూపారు UK ప్రధాని రిషి సునక్ దంపతులు. UK ప్రధాన మంత్రి రిషి సునక్, అతని భార్య, అక్షతా మూర్తి లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తమ కుటుంబంతో కలిసి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

రిషి సునక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ లో దీపావళి వేడుకల చిత్రాలు, వీడియోను కూడా పంచుకున్నారు. నీలిరంగు చీర ధరించి, శ్రీమతి మూర్తి డౌనింగ్ స్ట్రీట్ వెలుపల దీపాలను వెలిగిస్తూ కనిపించారు. సునక్ కుమార్తెలు కృష్ణ , అనౌష్క కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

Mr సునక్ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు, " నం.10 మెట్ల మీద నా కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకోవడం నాకు ఒక ప్రత్యేక క్షణం. ఇక్కడ UKలో మరియు ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు!"

సునక్ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు వారికి వారి కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు అందజేశారు.మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా సునక్ కలిశారు. జైశంకర్ సునక్ కి వినాయకుడి విగ్రహాన్ని, భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారు.

Tags

Next Story