Rishi Sunak Britain : బ్రిటీష్ గడ్డను ఏలనున్న ప్రవాస భారతీయుడు
Rishi sunak Britain : బ్రిటెన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనీమా చేయడంతో ఇప్పుడు ఎవరు ఆ బాధ్యతలు చేపడతారనేదానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. గత కొన్ని నెలలుగా భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటెన్ కు కాబోయే ప్రధాని అని ఊహాగానాలు వెలువడ్డాయి. 42ఏళ్ల రిషి సునక్‌ను బోరిస్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు. తాజాగా రాజీనామా చేసిన మంత్రులలో రిషి సునక్ కూడా ఉన్నారు. నిన్నటి వరకు ఆయన బ్రిటెన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ (చాన్సలర్ ఆఫ్ ఎక్సచెకర్) బాధ్యతలను చేపట్టారు.
కోవిడ్ సంక్షోభంలో రిషి సునక్ అద్భతంగా పనిచేశారని ప్రశంసలు వెల్లువెత్తాయి. బిలియన్ పౌండ్లను ఖర్చు చేసి కార్మికులను, వ్యాపారవేత్తలను ఆదుకున్నారు. వీటితో పాటు కఠిన నిబంధనలను కూడా ఆయన అమలు పరిచారు. లాక్‌డౌన్ ను ఉల్లంఘించిన వారిపై ఫైన్లను విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.రిషిని డిషి అని కూడా కొందరు సంబోధిస్తుంటారు. రిషి సునక్ తాతలు పంజాబ్‌కు చెందిన వారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని రిషి పెళ్లిచేసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com