Rishi Sunak : ఒపీనియన్ పోల్స్‌లో రిషి సునక్‌కే మెజారిటీ..

Rishi Sunak : ఒపీనియన్ పోల్స్‌లో రిషి సునక్‌కే మెజారిటీ..
Rishi Sunak : రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది.

Rishi Sunak : రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది. అక్కడ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో రిషి సునక్‌కు 48 శాతం కన్జర్వేటివ్‌లు మద్దతు తెలిపారు. సుమారు 4400 మంది రిషి సునక్ ప్రధాని కావాలని ఆశించారు.

రిషి బ్రిటన్ ప్రధాని అయితే ఓ మంచి వ్యక్తిగా ఉంటారనే ఆశాభావాన్ని అనేకమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో అత్యధిక మెజారిటీ సంపాదించుకున్నవారినే బ్రెటన్ ప్రధానిగా నియమితులవుతారు.

నాయకుల పోటీలో రిషి సునక్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. తరువాత స్థానంలో విదేశాంగ మంత్రిగా ఉన్న లిజ్ ట్రూజ్ 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ మార్డాంట్ ఉన్నారు. ఒపీనియన్ పోల్స్ సహవ్యవస్థాపకులు జేమ్స్ జాన్సన్ ఈ పోలింగ్‌కు సంబంధించిన ఫలితాలను పోస్ట్ చేశారు. రిషి మంచి ప్రధానిగా ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు.

Tags

Next Story