కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం... 15 మంది మృతి

కెనడాలో జరిగిన హైవే ప్రమాదంలో 15 మంది సీనియర్లు మరణించారు. ఒక క్యాసినోకు సీనియర్లను తీసుకువెళుతున్న బస్సు సెమీ ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టడంతో 15 మంది మరణించారు, మరో 10 మంది గాయపడ్డారు. బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారని సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించిన అధికారులు తెలిపారు.
అయితే బస్సు, ట్రక్కు రెండింటి డ్రైవర్లు సజీవంగా ఉన్నారు. మృతులు ప్రధానంగా వృద్ధులే. మానిటోబా రాజధాని విన్నిపెగ్‌కు పశ్చిమాన 170 కిలోమీటర్లు దూరంలో ఉన్న కార్బెర్రీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చాలా విషాదకరమైనది అని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. "నేను ఈ రోజు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
2018లో జరిగిన బస్సు ప్రమాదంలో హంబోల్ట్ బ్రోంకోస్ మైనర్ లీగ్ హాకీ జట్టుకు చెందిన 16 మందిని బలితీసుకుంది. ఆ నాటి విషాద సంఘటనను అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com