RUSSIA: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి

రష్యా(Russia)లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ వరుస దాడులకు పాల్పడుతుండడం పుతిన్‌ను కలవరపెడుతోంది. పాశ్యాత్య దేశాల నుంచి వచ్చిన ఆయుధ సంపత్తితో మాస్కోపై జెలెన్‌స్కీ సేనలు దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా జరిగిన భీకర దాడి రష్యన్లకు వెన్నులో వణుకు పుట్టించింది.
సౌత్ వెస్టర్న్ రష్యాలోని ఓడరైవు నగరమైన టాగన్రోగ్ సిటీ(southern Russian city of Taganrog )పై ఉక్రెయిన్ సైన్యం క్షిపణి(Ukrainian missile ) దాడికి తెగబడిందని మాస్కో ఆరోపణలు చేసింది. ఈ దాడిలో 20 మందికి గాయాలైనట్లు(blast injured several civilians ) రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో కీవ్ ప్రయోగించిన రెండు క్షిపణుల్లో(missile ) ఒక దానిని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. టాగన్రోగ్ నగరం ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
టాగన్రోగ్ సిటీలోని ఘటనాస్థలిని రష్యన్ ఇన్వెస్టిగేషన్ కమిటీ పరిశీలిస్తోంది. ఉక్రెయినే క్షిపణి దాడి చేసిందన్న ఆధారాల కోసం.... అన్వేషిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు మిస్సైల్ శిథిలాల కోసం గాలిస్తున్నట్లు ఆ కమిటీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోలను రష్యా టీవీ బహిర్గతం చేసింది. అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే దాడి ప్రభావం చాలా ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. రోడ్లపై నిలిపిన వాహనాలు ధ్వంసమయ్యాయి.
టాగన్రోగ్ నగరంపై జరిగిన దాడిని ఉక్రెయిన్ ఉగ్రచర్యగా క్రెమ్లిన్(Russian Ministry of Defense ) ఆక్షేపించింది. దీనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు అజోవ్ నగరంపైకి కూడా ఓ ఉక్రెయిన్ మిస్సైల్ దూసుకొచ్చిందని దాన్ని నేలమట్టం చేశామని రష్యా తెలిపింది. మాస్కో ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. రష్యా గగనతల వ్యవస్థ వైఫల్యం వల్లే పేలుడు సంభవించిందని కీవ్ రక్షణశాఖ ప్రకటించింది.
ఉక్రెయిన్ స్టేట్‌హుడ్ డేను పురస్కరించుకొని ఇటీవల కీవ్‌లో ప్రసంగించిన వొలొదిమిర్ జెలెన్‌స్కీ రష్యాకు హెచ్చరికలు పంపారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌కు అసలు దేశమనే అస్తిత్వమే లేదంటూ ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టడమే లక్ష్యంగా జెలెన్‌స్కీ ప్రసంగం కొనసాగింది.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. ఆగ్నేయ ఉక్రెయిన్‌లో పుతిన్ సేనల నుంచి తిరిగి తమ వశం చేసుకున్నట్లుగా జెలెన్‌స్కీ బలగాలు ఇటీవల ప్రకటించిన ఓ గ్రామంపై రష్యా తాజాగా దాడులతో విరుచుకుపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com