Russia vs Ukraine War: ఉక్రెయిన్‌కు చేరుకున్న లెపర్డ్-2 ట్యాంకులు

ఏడాది కాలంగా రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతుంది. అయితే ఉక్రెయిన్‌కు పలు దేశాలు యుద్ద సామాగ్రిని అందిస్తున్నాయి. తాజాగా జర్మనీ నుంచి అత్యాధునిక లెపర్డ్-2 ట్యాంకులు ఉక్రెయిన్‌కు చేరుకున్నాయి. ఈ ట్యాంకులను ఉక్రెయిన్‌కు సరఫరా చేయడానికి ముందే ఆ దేశ సైనికులకు వీటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. నాటోదేశాలు దాదాపు 2వేల లెపర్డ్-2 ట్యాంకులను వాడుతున్నాయి. జర్మనీ ఈ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించేందుకు జనవరిలో అంగీకరించింది. ఈ ట్యాంకులతోపాటు ఉక్రెయిన్‌కు రెండు ట్యాంక్ రికవరీ వాహనాలను కూడా జర్మనీ పంపుతోంది. మరో 40 మార్డర్ ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్ వాహనాలను కూడా అందించనుంది.
యుద్ధంలో చాలావరకూ ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్.. క్రమంగా రష్యాపై ఎదురుదాడికి దిగాలనుకుంటోంది. ఈ మేరకు కొంతకాలంగా డ్రోన్లు, హిమార్స్‌లతో విరుచుకుపడుతోంది. రష్యా చేజిక్కించుకున్న తన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రధాన యుద్ధ ట్యాంకులతో భారీగా దాడికి దిగాలని భావిస్తోంది. ఇందుకు లెపర్డ్-2 బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. లెపర్డ్-1 పేరుతో తొలిసారిగా 1979లో వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆధునిక వేరియంట్లు వచ్చాయి. ప్రస్తుత లెపర్డ్-2 కాల్పుల సామర్థ్యం అమోఘం. వేగం, చురుగ్గా ఎటైనా కదిలే ఒడుపు దీని సొంతం. ఇందులోని ఆయుధ వ్యవస్థలకు పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com