Bangladesh Former PM : బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర అభియోగాలు

Bangladesh Former PM : బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర అభియోగాలు
X

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై తాత్కాలిక ప్రభుత్వం తీవ్రమైన అభియోగాలు మోపింది. ఆమె పాలనలో అనేక మంది అధికారులు అదృశ్యమయ్యారనీ.. హత్యకు గురయ్యారనీ.. వీటన్నింటి వెనుక హసీనా హస్తం ఉందని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినవిచారణ కమిషన్ తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ అన్ ఫోల్డింగ్ ది ట్రూత్ అనే శీర్షికతో శనివారం అర్ధరాత్రి తర్వాత నివేదిక అందజేసింది. ఈ రిపోర్టులో అధికారుల బలవంతపు అదృశ్యాల ఘటనల్లో హసీనా ప్రమేయానికి ఆధారాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఆమె రక్షణ సలహాదారు, మాజీ మేజర్ జనరల్ అహ్మద్ సిద్ధిఖ్, నేషనల్ టెలికమ్యూనికేషన్ మానిట రింగ్ సెంటర్ మాజీ డైరెక్టర్ జియావుల్ అహ్సాన్, సీనియర్ పోలీసు అధికారులు మోనిరుల్ ఇస్లాం, మహ్మద్ హరున్-ఓర్-రషీద్ సహా కొంతమంది ఉన్నతస్థాయి అధికారులకు సైతం ఈ అకృత్యాల్లో సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నామని చెప్పారు. మాజీ మిలిటరీ, పోలీసు అధికారులు పరారీలో ఉన్నారు. విద్యార్థుల తిరుగుబాటు తర్వాత వీరిలో ఎక్కువ మంది విదేశాలలో ఉన్నట్లు సమాచారం. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, యాంటీ రాపిడ్ యాక్షన్ బెటాలియన్, ఇతర చట్ట సంస్థలు ఒకదానికొకటి సహకరించుకుని, బాధితులను హింసించడం, నిర్బం ధిచడం వంటి చర్యలకు పాల్పడ్డాయని కమిషన్ వెల్లడిం చింది. దాదాపు 3500 మంది అదృశ్యమైనట్లు కమిషన్ సభ్యుడు సజ్జాద్ హుస్సేన్ తెలిపారు.

Tags

Next Story