Sheikh Hasina : భారత్‌ను వీడిన షేక్ హసీనా టీమ్.. సీక్రెట్ ప్లేస్‌కు పయనం

బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరతో షేక్ హసీనా రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆమె మొదట భారత్ లోనే తాత్కాలిక షెల్టర్ తీసుకున్నారు. బంగ్లాలో గడిచిన కొద్ది వారాలుగా అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి తన సోదరి, ఇతర సన్నిహితులతో కలిసి భారత్ కు వచ్చారు.
ఆగస్ట్ 8 వరకు హసీనా సోదరులు సహా ఆమె టీమ్ మొత్తం ఘజియాబాద్ లోని హిందన్ ఎయిర్ బేస్ లో తాత్కాలిక ఆశ్రయం పొందారు. అయితే, తాజాగా హసీ నా టీమ్ భారత్ ను వీడినట్లు తెలిసింది. ఆమె టీమ్ మొత్తం కొత్త గమ్యస్థానాలను వెతుక్కుంటూ వెళ్లిందని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వారంతా తెలియని ప్రదేశానికి వెళ్లినట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి. కాగా, రాజీనామా అనంతరం హసీనా తన సోదరితో కలిసి ఆగస్ట్ 5 సోమవారం సాయంత్రం భారత్లో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత భారత ప్రభుత్వ సహకారంతో హసీనా లండన్ వెళ్లాలని భావిం చారు. లండన్లో రాజకీయ శరణార్థిగా వెళ్లాలనుకున్నారు. అయితే, అందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ ఆసక్తిగా లేనట్లు తెలిసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ ఆరేబియా దేశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com