Air India : ఎయిరిండియాలోకి మరో రూ.3,195 కోట్లు

Air India : ఎయిరిండియాలోకి మరో రూ.3,195 కోట్లు
X

టాటా గ్రూప్ కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో, సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ విస్తారాను విలీనం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల విలీన ప్రక్రియ 2022 నవంబర్ 29న స్టార్ట్ కాగా ఈ రోజు పూర్తి కానుంది. కాగా విలీనం తర్వాత సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటా ఉండనుంది. ఈ నేపథ్యంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో రూ. 3,195 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. కాగా విస్తారా 2015 జనవరి 9 నుంచి మన ఇండియాలో సేవలందిస్తోంది. అయితే విలీనం తర్వాత ఈ నెల 12 నుంచి ఎయిర్ ఇండియా-విస్తారా కలిసి ఒకటే విమానయాన సంస్థగా సేవలు అందించనుంది. ఎయిర్ ఇండియా అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడుతామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Tags

Next Story