Sri Lanka: వీసా లేకుండానే శ్రీలంకకు వెళ్లొచ్చు..

Sri Lanka: వీసా లేకుండానే శ్రీలంకకు వెళ్లొచ్చు..
7 దేశాల ప్రజలకి అవకాశం

పర్యాటకరంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన శ్రీలంక విదేశీ పర్యాటకులను ప్రోత్సహించే దిశలో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతించాలని నిర్ణయిచింది. ఈ విధానాన్ని ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టామని లంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. ఈ విధానం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని అలీ చెప్పారు. భారత్ సహా చైనా, రష్యా, మలేసియా, జపాన్ , ఇండోనేసియా, థాయ్ లాండ్ దేశాల పర్యాటకులను వీసా లేకుండానే అనుమతిస్తామని ఆయన తెలిపారు. కొవిడ్ -19, ఆ తర్వాత దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం మూలంగా తగ్గిన పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని అలీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ఏడాది 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన ఏడు దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే అనుమతిస్తున్నట్టు తెలిపారు.


శ్రీలంక అంటేనే పర్యాటకానికి పెట్టింది పేరు. ఆ దేశానికి వచ్చే ఆదాయంలో అధిక శాతం విదేశీ పర్యాటకుల ద్వారానే వస్తుంది. అయితే కొవిడ్ కారణంగా పర్యాటక రంగానికి పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో శ్రీలంక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. దీనికితోడు శ్రీలంకలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో ఆ దేశంలో మరిన్ని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత రాజకీయంగా కొంత స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో కాస్త కుదుటపడింది. ఈ నేపథ్యంలోనే తగ్గిపోయిన విదేశీ పర్యాటకులను తిరిగి ఆ దేశానికి రప్పించేందుకు శ్రీలంక ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలోనే వీసాలు లేకుండానే ఆ దేశంలో పర్యటించేందుకు అవకాశం కల్పించింది. భారత్, చైనా సహా 7 దేశాల ప్రజలు.. వీసా లేకుండానే పర్యటించేందుకు తాజాగా అనుమతిని ఇచ్చింది.

ద్వీప దేశమైన శ్రీలంక‌కు పర్యాటకం ప్రధాన ఆదాయవనరుగా మారిన విషయం తెలిసిందే. అయితే, 2020 నాటి కరోనా సంక్షోభం, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయం వెరసి శ్రీలంకకు విదేశీ పర్యాటకుల రాకడపై ప్రతికూల ప్రభావం చూపించాయి. పరిస్థితిని సాధారణ స్థితికి చేర్చేందుకు నడుం కట్టిన శ్రీలంక ప్రస్తుతం పలు దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.


Tags

Read MoreRead Less
Next Story