Stock Marke : నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్​

Stock Marke : నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్​
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అధికారంలోకి రాగానే మెక్సికో, కెనడా, చైనా దిగుమతలపై సుంకాలు విధిస్తానని చెప్పి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్‌.. నిర్ణయాల ప్రభావం ప్రపంచ వాణిజ్య సంబంధాలపై పడే అవకాశం ఉందన్న ఆందోళనలు మదుపర్లను కలవరపెట్టాయి. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టోయాయి. సెన్సెక్స్‌ ఉదయం 80,415.47 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,109.85) లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి 105.79 పాయింట్ల నష్టంతో 80,004.06 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 27.40 పాయింట్ల నష్టంతో 24,194.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.33గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2629 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags

Next Story