క్రేజీ స్టూడెంట్స్.. టీచర్ కి బర్త్ డే సర్ఫ్రైజ్

క్రేజీ స్టూడెంట్స్.. టీచర్ కి బర్త్ డే సర్ఫ్రైజ్

నేపాల్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్‌లోని విద్యార్థులు తమ ఉపాధ్యాయుడు సుజన్ సర్ మధ్య అద్భుతమైన బంధాన్ని చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పోఖారాలోని గండకి బోర్డింగ్ స్కూల్ (GBS)లో రికార్డ్ చేయబడింది. సుజన్ సర్ అనే ఉపాధ్యాయునికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. విద్యార్థులు అతని పుట్టినరోజును అత్యంత గుర్తుండిపోయే విధంగా జరుపుకోవడానికి ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విద్యార్థి షేర్ చేసిన ఈ క్లిప్, విద్యార్థులు తమ ప్రియమైన ఉపాధ్యాయుడిని ఎలా సర్ఫ్రైజ్ చేశారో చూపిస్తోంది. వీడియో ముందుకెళ్తున్న కొద్దీ, కొంతమంది విద్యార్థులు హడావిడి చేశారు. అయితే సరిగ్గా ఈ తరుణంలోనే సుజన్ సర్ అడుగుపెట్టాడు. తన ప్రశాంతమైన ప్రవర్తన, శ్రద్ధగల స్వభావంతో, అతను పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు.

అంతలోనే ఒక విద్యార్థి చేతిలో పుష్పగుచ్ఛంతో గుంపు నుండి బయటకు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలతో సుజన్ సర్‌ని ఆశ్చర్యపర్చాడు. తనతో పాటు సంబరాలు చేసుకోవడానికి కలిసి వచ్చిన విద్యార్థులు తనను ఆలింగనం చేసుకోవడంతో ఉపాధ్యాయుడి ముఖం ఆనందం, కృతజ్ఞతతో వెలిగిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story