China: తైవాన్ స్వాతంత్య్రం అంటే యుద్ధమే..

తైవాన్ నూతన అధ్యక్షుడు లై చింగ్-తె స్వయంపాలన వ్యాఖ్యలతో ఇటీవల చైనా భగ్గుమంది. ఆ దేశం చుట్టూ భారీఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే తైవాన్‌ను ఉద్దేశించి ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘తైవాన్ స్వాతంత్ర్యం’ అంటే యుద్ధమేనని పేర్కొంది. ఆ దేశంలో వేర్పాటువాద కార్యకలాపాలకు మద్దతుగా విదేశీ జోక్యాన్ని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది.
‘‘చైనా పునరేకీకరణ అనేది చరిత్రలో మార్చలేని అంశం. జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడే బాధ్యతను ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)’ తన భుజాలకెత్తుకుంది. ‘తైవాన్ స్వాతంత్ర్యం’ ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు, ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని నిలువరిచేందుకు దృఢమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది’’ అని చైనా సైనిక ప్రతినిధి సీనియర్ కర్నల్ వు కియాన్ తెలిపారు. ఆ దేశ స్వాతంత్ర్యాన్ని కోరుకునే వేర్పాటువాద శక్తులు.. తైవాన్ జలసంధిలో శాంతిస్థాపనకు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని ఆరోపించారు.
భారత సరిహద్దులో అధునాతన ఫైటర్ జెట్‌ల మోహరింపు
ఇటీవల తైవాన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తూ డ్రాగన్‌పై చింగ్-తె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాంత స్వయంపాలనను సమర్థించారు. దీంతో ఆగ్రహించిన చైనా.. నూతన అధ్యక్షుడిని వేర్పాటువాదిగా పేర్కొంటూ ఆ ద్వీపం చుట్టూ భారీఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో ఆయన దూకుడు తగ్గించారు. బీజింగ్‌తో కలిసి సమన్వయం చేసుకొంటూ.. పని చేసేందుకు సిద్ధమేనన్నారు. తైవాన్, చైనాల మధ్య శాంతి.. ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమని, అంతర్జాతీయ భద్రతకూ ముఖ్యమని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com