Telegram CEO : టెలిగ్రాం సీఈఓ వీర్యదానం.. 12దేశాల్లో 100మందికి బయోలాజికల్ తండ్రి

Telegram CEO : టెలిగ్రాం సీఈఓ వీర్యదానం.. 12దేశాల్లో 100మందికి బయోలాజికల్ తండ్రి
X

పెళ్లి చేసుకోకుండానే.. కాపురం చేయకుండానే 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తాను తండ్రి అయినట్లు టెలిగ్రాం సీఈఓ పావెల్ దురోప్ వెల్లడించారు. ఫ్రెండ్ కోసం మొదలైన తన వీర్యదానం చాలా దేశాలకు పాకిందని, సంతానం లేని దంపతులకు సాయం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇదంతా బయోలాజికల్గా జరిగిందన్నారు.

"నాకు 100 మందికి పైగా పిల్లలున్నారు. 15 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ ఒకరు వింత సాయం కోరాడు. పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం. కోసం నన్ను వీర్యదానం చేయమన్నాడు. అది విని నేను విపరీతంగా నవ్వుకున్నా. పిల్లలు లేని లోటు ఎలా ఉంటుం దో ఆ బాధ తర్వాత అర్ధమైంది. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దానం చేసేవారు చాలా తక్కువమంది ఉన్నారని ఓ వైద్యుడు నాకు చెప్పారు. వీర్యాన్ని దానం చేసి సంతానం లేని దంపతులకు సాయం చేయడం సామాజిక బాధ్యత అన్నారు. దీంతో నేను స్పెర్మ్ డొనేషన్లో రిజిస్టర్ చేసుకున్నా. అలా 12 దేశాల్లో వందమందికి పైగా జంటలకు సంతానాన్ని అందించా. చాలా ఏళ్ల క్రితమే నేను వీర్యం దానం చేయడం ఆపినప్పటికీ ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు పిల్లలు పుడుతున్నట్లు తెలుసుకుంటున్నా" అని సీఈఓ పావెల్ దురోవి వివరించారు.

మరింత ఎక్కువమంది వీర్య దానానికి ముందుకురావాలని కోరుతున్నానని చెప్పారు పావెల్. ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టడంతో కొంత రిస్క్ ఉన్నా... దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags

Next Story