MP Sana Satish :నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగోళ్లకు..సహాయక చర్యలు.

నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగు ప్రజల రక్షణ కోసం నారా లోకేష్( Nara Lokesh ) గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ బాబు ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నారా లోకేష్ గారి సూచనల మేరకు, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక అత్యవసర కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయబడింది. ఇక్కడి నుండి సానా సతీష్ బాబు గారు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కంట్రోల్ సెల్ సమాచారం ప్రకారం, మొత్తం 217 మంది ఆంధ్ర నివాసితులు 12 వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారని గుర్తించారు. వారిలో 118 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. ఖాట్మండులో 173 మంది ఉన్నారని గుర్తించడం జరిగింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి నేపాల్‌లోని తెలుగు ప్రజల స్థితిని ట్రాక్ చేస్తూ, వారికి ధైర్యం చెబుతున్నారు. భారత రాయబార కార్యాలయం మరియు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు నారా లోకేష్ తో ఆయన సమన్వయం చేసుకుంటూ, తెలుగు ప్రజలను తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా లోకేష్ ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు అయ్యేలా చూశారు. విమానం నేపాల్ నుండి విశాఖపట్నం మరియు కడపకు చేరుకుంటుంది. పాస్‌పోర్ట్‌లు కోల్పోయిన వారికి తాత్కాలిక ప్రయాణ పత్రాలు జారీ చేయించడానికి కూడా ఆయన రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు. నారా లోకేష్ గారి విజన్ ప్రకారం, ప్రతి ఒక్కరినీ సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి సానా సతీష్ బాబు ఢిల్లీలో కంట్రోల్ సెంటర్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com