U.S Birthright Citizenship : బర్త్ రైట్ సిటిజన్ షిప్ హక్కుకు తాత్కాలికంగా బ్రేక్

U.S Birthright Citizenship : బర్త్ రైట్ సిటిజన్ షిప్ హక్కుకు తాత్కాలికంగా బ్రేక్
X

పుట్టకతో సంక్రమించే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని, ఆ ఆర్డర్ ను తాత్కాలికంగా అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వాషింగ్టన్ స్టేట్ డిస్ట్రిక్ట్ (సియాటెల్) జడ్జ్ న్యాయ మూర్తి జస్టిస్ జాన్ కౌగెనౌర్ ఆదేశాలిచ్చారు. ఆ ఆర్డర్ రాజ్యాంగాన్ని గుడ్డిగా, ఘోరంగా వ్యతి రేకించడమేనని ఫెడరల్ జడ్జ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆర్డర్ను డెమొక్రాట్లు అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండగా న్యాయశాఖ మద్దతుగా వాదించింది. అధికారం చేపట్టిన తొలిరోజునే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ డెమొక్రాట్లు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలు, పౌర హక్కుల సంఘాలు కేసులు వేశాయి.

సియాటెల్ జిల్లా కోర్టులో కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జాన్ కౌగె నౌర్ మాట్లాడుతూ, నాలుగు దశాబ్దా లుగా న్యాయస్థానంలో పనిచేస్తున్నానని, ఇలాంటి ఘోరమైన రాజ్యాంగ విరుద్ధ మైన ఆర్డర్ను ఎన్నడూ చూడ లేదని అన్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ మరో 14 రోజులపాటు అమలు చేయకుండా తాత్కాలిక ఆదేశాలిచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా వేసిన న్యాయమూర్తి, ఈ ఆదేశాలను మరింత కాలం పొడిగించాలా.. లేదా అన్నది ఆరోజు నిర్ణయిస్తామని వెల్లడించారు. ఈలోగా ఇరుపక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది.

Tags

Next Story