US–Iran : చర్చలు ఫెయిల్.. మళ్లీ యుద్ధం తప్పదా..?

పశ్చిమాసియా యుద్ధం మళ్లీ తప్పేలా లేదు. రెండు వారాల పాటు యుద్ధానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నిన్న 21 గంటల పాటు అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగాయి. అటు అమెరికా నుంచి జేడీవాన్స్, తో పాటు కొందరు అధికారులు వచ్చారు. ఇటు ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్, విదేశాంగ శాఖ మంత్రి వచ్చారు. వీరంతా చర్చలు జరిపారు. ఇందులో అమెరికా కొన్ని కండీషన్లు పెట్టింది. హర్మూజ్ ను ఓపెన్ చేయాలని, శుద్ధి చేసిన యురేనియం అప్పజెప్పాలని చెప్పింది.
కానీ ఈ కండీషన్లకు ఇరాన్ అస్సలు ఒప్పుకోలేదు. హర్మూజ్ తమ కంట్రోల్ లో ఉంటుందని ఇరాన్ తెలిపింది. అలాగే యురేనియంను అప్పజెప్పేది లేదని.. అది తమ హక్కు అంటూ తేల్చి చెప్పేసింది. దాంతో పాటు లెబనాన్ మీద దాడులను ఆపాలంటూ ఇరాన్ డిమాండ్ చేసింది. తమ హక్కులను కాపాడే విధంగా చర్చలు జరిగితేనే ఒప్పందానికి ఒప్పుకుంటామని లేదంటే యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ కండీషన్లకు అమెరికా కూడా అస్సలు ఒప్పుకోలేదు. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం తప్పదా అంటూ అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయి. అదే జరిగితే ప్రపంచానికి మళ్లీ సంక్షోభం తప్పదని.. కాబట్టి శాంతి ఒప్పందానికి రెండు దేశాలు ముందుకు రావాలని కోరుతున్నాయి. మరి రెండు దేశాల నడుమ చర్చలు జరుగుతాయా లేదంటే మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకుంటాయా అనేది తెలియాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
