U.S. Population : పెరిగిన అమెరికా జనాభా.. ఎంతంటే?

U.S. Population : పెరిగిన అమెరికా జనాభా.. ఎంతంటే?
X

అమెరికా జనాభా 34 కోట్లకు చేరింది. 23ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జనాభా వృద్ధి నమోదైందని, ఈ ఏడాదిలో పెరిగిన 1% ఇప్పటి వరకు అధికమని అమెరికా తెలిపింది. విదేశీయుల వలసలే దీనికి కారణమని చెప్పింది. ఈ ఏడాది 33లక్షల మంది జనాభా పెరగ్గా అందులో వలస వచ్చిన వారే 28 లక్షల మంది ఉన్నట్లు తెలిపింది. 2023-24 మరణాల కంటే జననాలే అధికమని పేర్కొంది. 2022లో 17లక్షలు, 2023లో 2.3లక్షల మంది జనాభా పెరిగింది.

పాక్ ఖండాంతర క్షిపణుల్ని అభివృద్ధి చేయడంపై అమెరికా జాతీయ భద్రత సహాయ సలహాదారు జాన్ ఫైనర్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీర్ఘ పరిధి బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పాక్ అభివృద్ధి చేస్తోంది. ఆ క్షిపణులు మా వరకూ రాగలవు. వీటి అభివృద్ధి వెనుక పాక్ ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మాకు ప్రమాదకరంగా మారుతోందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా.. అమెరికా గతంలో పాక్‌కు అండగా నిలవడం గమనార్హం.

Tags

Next Story