Russia-Ukraine War : రష్యా- యుక్రెయిన్ వార్ మరింత తీవ్రం

Russia-Ukraine War : రష్యా- యుక్రెయిన్ వార్ మరింత తీవ్రం
X

రష్యా-యుక్రెయిన్ యుద్ధం పీక్స్ కు చేరింది. ఉక్రెయిన్‌పై 5వేల కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను చేధించగల ఖండాంత‌ర క్షిపణిని రష్యా ప్రయోగించింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నిర్ధారించింది. కింజల్ బాలిస్టిక్ మిసైల్‌ ప్రయోగించినట్లు వెల్లడించింది. డ్నిప్రో నగరాన్ని క్షిపణి లక్ష్యంగా చేసుకున్నట్లు వైమానిక దళం తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన 1000 రోజుల తర్వాత రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. డిప్రో సిటీపై జ‌రిగిన దాడిలో భారీ న‌ష్టం సంభ‌వించింది. ప‌లు భ‌వ‌నాలు కూలిపోయాయి. అనేక మంది గాయ‌ప‌డ్డారు

Tags

Next Story