Pakistan : పాక్ మేకపోతు గంభీర్యం.. మంత్రి పిచ్చికూతలు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ దాడి జరిగిన వెంటనే దాయాది దేశంపై భారత్ పలు ఆంక్షలు విధించింది. వీసాల రద్దు, సింధు నది జలాల ఒప్పందం వంటి ఆంక్షలు విధించింది. అంతేకాకుండా భారత్ గగనతంలో పాక్ ఎయిర్ లైన్స్ ప్రయాణించకుండా నిషేధం విధించింది. అయితే సింధు జలాల నది ఒప్పందం రద్దు తర్వాత పాక్ తీవ్ర నీటి సంక్షోభంలో కూరుకపోయింది. సింధు నది అయిన చీనాబ్ నది పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఇంత జరిగినా కూడా పాకిస్థాన్ మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పిచ్చికూతలు కూశాడు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా పేల్చేస్తామంటూ అవాకులు చవాకులు పేలారు. అంతకుముందు పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. సింధూ నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ మాట్లాడారు.
గతంలో యుద్ధాలు, తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా..భారత్ ఈ ఒప్పందం నుంచి వైదొలగలేదు. కానీ ఈ సారి మోడీ సర్కార్ మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాక్‌ను అన్ని విధాల ఒంటరినీ చేసేందుకు భారత్ అన్ని వ్యూహాలు రచిస్తోంది. అటు అంతర్జాతీయంగా నిధులు రాకుండా పాక్‌ను దెబ్బకొట్టేలా వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com