Netanyahu : ట్రంప్ లాంటి మిత్రుడు మరొకరు ఉండరు : నెతన్యాహు

Netanyahu : ట్రంప్ లాంటి మిత్రుడు మరొకరు ఉండరు : నెతన్యాహు
X

ఇరాన్ లో కీలకమైన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేయించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం కొనియాడారు. అమెరికా మిలటరీ చర్యను మిడిల్ ఈస్ట్ భవిష్యత్తుకు కొత్త రూపాన్ని ఇచ్చే ఒక సాహసోపేతమైన, చరిత్రాత్మక చర్యగా నెతన్యాహు వర్ణించారు. వీడియో మెసేజ్ పంపిన నెతన్యాహు శక్తితోనే శాంతి నెలకొంటుందని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అపరిమితమైన శక్తిని ప్రదర్శించాయని.. ఇది ఒక నిర్ణయాత్మకమైన, సాహసోపేతమైన చర్య అన్నారు. చరిత్రలో చిరస్మరణీయమవుతుందని చెప్పారు. ట్రంప్ లాంటి స్నేహితుడు మరొకరు ఉండరని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ఆర్జించు కోవాలనుకునే అత్యంత ప్రమాదకరమైన ఏలుబడిని ఈ చర్య తిరస్కరించిందని అన్నారు.

Tags

Next Story