యుద్దం ముగియాలంటే అతడిని కూడా 'మదురో' మాదిరిగా కిడ్నాప్ చేయాలి: జెలెన్క్సీ

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు రాజధాని కారకాస్ నుండి కిడ్నాప్ చేశాయి. ప్రస్తుతం ఆయన, ఆయన భార్య అమెరికాలో నిర్భంధంలో ఉన్నారు. అక్కడ వారు నార్కో టెర్రరిజం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమర్ జెలెన్స్కీ అమెరికాకు భిన్నమైన డిమాండ్ చేశారు. రష్యా స్వయం ప్రతిపత్త ప్రాంతమైన చెచెన్ రిపబ్లిక్ పై అమెరికా దాడి చేసి దాని ప్రభుత్వ అధిపతి రంజాన్ కదిరోవ్ ను కిడ్నాప్ చేస్తే యుద్ధం ముగిసి శాంతి నెలకొంటుందని ఆయన అన్నారు. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు బలమైన సందేశాన్ని పంపుతుందని అన్నారు.
పాశ్చాత్య మిత్ర దేశాలు రష్యాపై గరిష్ట ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఇది ఉక్రెయిన్ తో రష్యా కొనసాగిస్తున్న యుద్దం ముగిసేందుకు తోడ్పడుతుందని అన్నారు. కదిరోవ్ ను కిడ్నాప్ చేస్తే రష్యా తో చర్చలు జరపడం సులభం అవుతుందని అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి చర్చలు వేగవంతం అవుతాయని అన్నారు. వెనిజులా అధ్యక్షుడి కిడ్నాప్ చర్యను జెలెన్స్కీ స్వాగతించారు. ఇది సరైన నిర్ణయమని వెనిజులా ప్రజలకు గొప్ప ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
కదిరోవ్ పై ఇలాంటి ఆపరేషన్ జరిగితే పుతిన్ కూడా రాజీ గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. చెచెన్ నాయకులు చర్చలకు ఆటంకం కలిగిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవడం అవసరమని జెలెన్క్సీ అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని యుద్దం ఎప్పుడైనా ముగియవచ్చని ట్రంప్ పదే పదే పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

