Train Acciden : పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం: 30 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు

పాకిస్థాన్‌లోని లాహోర్‌కు సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం గురువారం, ఆగస్టు 1, 2025న సాయంత్రం లాహోర్ శివారులో ఉన్న షాదారా బాగ్ ప్రాంతంలో జరిగింది. కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్తున్న
అల్లామా ఇక్బాల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఐదు బోగీలు షాదారా స్టేషన్‌లో పట్టాలు తప్పినట్లు పాకిస్థాన్ రైల్వే అధికారులు ధృవీకరించారు. రైలు వేగం తక్కువగా ఉన్నప్పటికీ, బోగీలు పట్టాలు తప్పడంతో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమికంగా, ట్రాక్‌ల నిర్వహణ లోపం లేదా సాంకేతిక సమస్య కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com