Trump Orders : ఉగ్రవాదుల్ని బంధించే చోటికి అక్రమ వలసదారుల తరలింపు

అక్రమ వలసదారుల నియంత్రణకు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారందరినీ గ్వాంటనామో బేకు తరలించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేస్తానన్నారు. 30వేల పడకలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘కొన్ని దేశాలపై నాకు నమ్మకం లేదు. వారిని మళ్లీ తిరిగిపంపొచ్చు. అందులో కొందరు అమెరికాకు అత్యంత ప్రమాదకరం. వారు గ్వాంటనామో నుంచి తప్పించుకోలేరు’ అని అన్నారు. సాధారణంగా ఇక్కడ ఉగ్రవాదులను బంధించి టార్చర్ చేస్తుంటారు.
అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసా హోల్డర్ల పిల్లలకు జన్మత: పౌరసత్వం నిరోధించే బిల్లును రిపబ్లికన్ సెనేటర్లు కొందరు US సెనేట్లో ప్రవేశపెట్టారు. అక్రమ వలసలు, జాతీయ భద్రత బలహీనతకు బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ దోపిడీయే కారణమని సెనేటర్లు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రూడ్, కేటీ బ్రిట్ అంటున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో దీనికి తెరపడుతుందన్నారు. ఇకపై నిర్దేశించిన తేదీ తర్వాత పుట్టే పిల్లలకే బర్త్‌రైట్ ఉండదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com